అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు.
జనవరి 16నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. తొలి దశలో 30కోట్ల మందికి టీకా వేయనున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు తొలి దశలో వ్యాక్సిన్ అందించనున్నారు. దేశవ్యాప్తంగా 37 స్టోరేజ్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.