ఉత్తరాఖండ్‌ టోపీ.. మణిపూర్‌ కండువా.. రిపబ్లిక్ డేలో మోదీ ప్రత్యేక ఆకర్షణ..

PM Modi: గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Update: 2022-01-26 12:15 GMT

ఉత్తరాఖండ్‌ టోపీ.. మణిపూర్‌ కండువా.. రిపబ్లిక్ డేలో మోదీ ప్రత్యేక ఆకర్షణ..

PM Modi: గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి వేడుకల్లో ఉత్తరాఖండ్‌ సంప్రదాయ టోపీతో పాటు మణిపూర్‌ సంప్రదాయ వస్త్రమైన తువ్వాలును ధరించారు. ప్రధాని మోదీ తమ సంప్రదాయ టోపీని ధరించి.. కోటి 25 లక్షల ఉత్తరాఖండ్‌ ప్రజలు గర్వించేలా చేశారని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింఘ్‌ ధామి ట్వీట్‌ చేశారు.

వస్త్రధారణపై ప్రత్యేక దృష్టి సారించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి ధరించిన టోపీ, తువ్వాలుపై జోరుగా చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న, మణిపూర్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరగనున్నది.

అయితే ఉత్తరాఖండ్‌ సంప్రదాయ టోపీని, మణిపూర్‌లోని మైత్రేయ్ గిరిజన తెగ వారు ధరించే తువ్వాలను మోదీ ధరించారు. రెండు రాష్ట్రాల ప్రజలను ఆకర్షించేలా ప్రధాని మోదీ వస్త్రధారణ ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల ఎన్నికల సమయంలో మోదీ వస్త్రధారణ అలా మారిపోతుందంటున్నారు.

బెంగాల్‌ ఎన్నికల సమయంలో మోదీ భారీగా మీసాలు, గడ్డం పెంచుకుని.. నెమళ్లకు ధానా వేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. అవి విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, శాంతినిలయాన్ని తలపించేదిలా ఉన్నాయి. బెంగాలీల మనస్సు చూరగొనేందుకే ప్రధాని మీసం, గడ్డం పెంచారంటూ అప్పట్లో జోరుగా చర్చించుకున్నారు.

Tags:    

Similar News