Kumbh Mela 2021: కుంభమేళా ముగిసినట్టేనా..?
Kumbh Mela 2021: ట్విట్టర్లో స్పందించిన ప్రధాని మోడీ * సంకేతంగా మాత్రమే చూడాలన్న ప్రధాని
Kumbh Mela 2021: ఉత్తరాఖండ్లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా ఇక ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కరోనా విజృంభిస్తున్న సమయంలో కుంభమేళా లాంటి ఉత్సవాలు నిర్వహించడం అంత మంచి పరిణామం కాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. దాంతో కుంభమేళాపై ప్రధాని మోడీ ట్విట్టర్ స్పందించారు. కుంభమేళా మహావేడుకను ఒక సంకేతంగానే చూడాలన్నారు. కరోనా సంక్షోభ వేళ కుంభమేళాను నిలిపివేయడం ఉత్తమమం అని ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే కుంభామేళాలో పాల్గొన్న 30 మంది సాధువులకు కరోనా సోకింది. నిరంజనీ అకారా సాధవుల క్షేమ సమాచారాన్ని ప్రధాని మోడీ తెలుసుకున్నారు. నాలుగు రోజుల్లోనే దాదాపు వేలాది మందికి కోవిడ్ సోకింది. దాంతో ఉత్తరాఖండ్ అలెర్ట్ అయింది.. కోవిడ్ సమయంలో కుంభామేళా గురించి ఆలోచించాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ.. నిరంజనీ అకారా అధ్యక్షుడు స్వామి అవదేశానంద గిరి జీ మహారాజ్‌తో ఫోన్‌లో మట్లాడారు.. సాధవుల ఆరోగ్యం కోసం అన్ని రకాల సహాకారాలు అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇప్పటివరకు కుంభమేళాలో సాధువులు రెండుసార్లు పుణ్య స్నానాలు చేశారని, ఇక కుంభమేళాలో జరిగే క్రతువులను ఒక ప్రతికగా మాత్రమే ఉంచుదామని, దీనివల్ల కరోనా సంక్షోభంపై పోరాడేందుకు బలం వస్తుందని ప్రధాని తెలిపారు..
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో నిత్యం లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇటీవల ఏప్రిల్ 12,14 రోజుల్లో జరిగిన షాహీ స్నాన్‌లలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కుంభమేళాలో లక్షలాది మంది ఒకే దగ్గర ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు.. కుంభమేళాలో పాల్గొన్న అనేక మంది భక్తులతో పాటు పలు అఖాడాలకు చెందిన సాధువులు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో కొన్ని అఖాడాలు స్వచ్ఛందంగా హరిద్వార్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు.
కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కుంభమేళాను ముగిస్తున్నట్టు నిరంజని అఖాడా ప్రకటించింది. అయితే.. దీనిపై మిగతా అఖాడాలకు చెందిన సాధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు కుంభమేళా జరగాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ఈ ఏడాది దీన్ని కుదించి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.