రైతులకు కేంద్రం శుభవార్త.. పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడో తెలుసా?
PM-KISAN: కేంద్రం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమచేసే సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది.
PM-KISAN: కేంద్రం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమచేసే సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రధాననమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద పదో విడుత నిధులను జనవరి 1న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తారని ప్రధాని కార్యాలయం (PMO) బుధవారం తెలిపింది.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 10కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్లకుపైగా నగదు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. దేశంలో అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లో కేంద్రం ఏటా రూ.6వేలు చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ మొత్తాలను జమ చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.1.6లక్షల కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేసినట్టు ప్రభుత్వం తెలిపింది.