Mahakal Corridor: కాశీవిశ్వేశ్వరనాథ్ కారిడార్ కంటే 4రెట్లు పెద్దది..
Mahakal Corridor: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ మహాకాల్ కారిడార్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.
Mahakal Corridor: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ మహాకాల్ కారిడార్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. వారణాసిలోని కాశీవిశ్వేశ్వరనాథ్ కారిడార్ కంటే 4రెట్లు పెద్దదైన ఈ కారిడార్‌ను ప్రధాని మోడీ అక్టోబర్ 11న ప్రారంభించనున్నారు. 20.23 హెక్టార్లలో 793 కోట్ల రూపాయల ఖర్చుతో కారిడార్ నిర్మిస్తున్నారు. 900 మీటర్ల పొడవు ఉండే కారిడార్‌లో 152 భవనాలను నిర్మించారు. కారిడార్‌ను క్షిప్ర నదీ తీరంలోని మహాకాల్ టెంపుల్‌తో కనెక్ట్ చేశారు.
కారిడార్ నుంచి మహాకాల్ ఆలయానికి వెళ్లే దారిలో 93 శివుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలపై QR కోడ్ ఉంటుంది. భక్తులు కోడ్‌ను స్కాన్ చేయగానే విగ్రహానికి సంబంధించిన వివరాలు ఫోన్‌లో కనిపిస్తాయి. మ్యూజికల్ ఫౌంటెయిన్‌తోపాటు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న మహాకాల్ కారిడార్‌ను వచ్చేనెల 11న ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.