Maitri Setu: నేడు 'మైత్రి సేతు' ను ప్రారంభించనున్న ప్రధాని

Maitri Setu: భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య నిర్మించిన 'మైత్రి సేతు'ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.

Update: 2021-03-09 06:36 GMT

ఇమేజ్ సోర్స్: ది హన్స్ ఇండియా 

Maitri Setu: భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య నిర్మించిన 'మైత్రి సేతు'ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. త్రిపుర, బంగ్లాదేశ్‌ సరిహద్దు మధ్య ప్రవహించే ఫెని నదిపై వంతెనను 'మైత్రిసేతు' పేరిట నిర్మించారు. నేషనల్‌ హైవే అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూ.133 కోట్లు వెచ్చించి 1.9 కిలోమీటర్ల పొడవున వంతెనను నిర్మించింది.

1.9 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన బంగ్లాలోని రామ్‌గఢ్‌, భారత్‌లోని సబ్రూమ్‌ను కలుపనుంది. అలాగే సబ్రూమ్‌లో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు నిర్మాణానికి పీఎం పునాది రాయి వేయనున్నారు. దీంతో పాటు 208 జాతీయ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు త్రిపురలో 40,978 ఇండ్లు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. 'ఇది రెండు దేశాల మధ్య వస్తువులు, ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి, ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులకు కొత్త మార్కెట్ అవకాశాలను అందించేందుకు సహాయపడుతుందని పీఎంఓ పేర్కొంది.

Tags:    

Similar News