PM Modi speech: చట్టం ముందు అందరూ సమానమే.. ప్రధానికే రూ.13 వేల జరిమానా విధించారు!

PM Modi speech: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ఈ రోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు

Update: 2020-06-30 17:15 GMT

PM Modi speech: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ఈ రోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. సాయింత్రం నాలుగు గంటలకు మోలాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మోదీ ఇప్పటి వరకు అయిదు సార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోడీ మాట్లాడుతూ.. ఆన్ లాక్ 1.0 తరవాత ప్రజల వ్యవహార శైలిలో నిర్లక్ష్య ధోరణి కనిపించిందని మోడీ అన్నారు. బయటకి వెళ్ళినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. కరోనా నిబంధనలు పాటించకపోతే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మోడీ హెచ్చరించారు.

చట్టం ముందు అందరూ సమానమే అన్న మోడీ మాస్కు ధరించకుండా బయటకు వెళ్లినందుకు ఒక దేశ ప్రధానికే ఏకంగా రూ.13 వేల జరిమానా విధించిన విషయాన్నీ మోడీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలాంటి నిబంధనలు కూడా మనదేశంలో కూడా కఠినంగా అమలు చేయాలని అన్నారు. ప్రస్తుతం కరోనా ఆన్ లాక్ 2.0 లోకి అడుగుపెడుతున్న సమయంలో ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. ఇలాంటి సమయంలోనే జలుబు, జ్వరం లాంటి రకరకాల రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని అన్నారు. అందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇక కరోనా విషయంలో భారత్ చాలా చురుకుగా పనిచేస్తుందని అన్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలిగామని అన్నారు. కరోనా సమయంలో కొన్ని రాష్ట్రాల తీరును ప్రధాని ప్రశంసించారు. ఇంకా మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మన పోరాటం 130 కోట్ల మందిని కాపాడుకొనేందుకేనని మోడీ చెప్పుకొచ్చారు. ఇక రాబోయే రోజుల్లో పండగలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నవంబరు ఆఖరు వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంద‌ని ప్రధాని మోదీ అన్నారు. దీని ద్వారా ఎక్కడైనా రేష‌న్ తెచ్చుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నమని మోదీ స్పష్టం చేశారు.

ఇక దేశంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,522 కేసులు నమోదు కాగా, 418 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం 5,66,840 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2, 15,125 ఉండగా, 3,34,821 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 16,893 మంది కరోనా వ్యాధితో మరణించారు.


Tags:    

Similar News