ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకు చేరిన వివాదం..
PM Security Breach: ప్రధాని మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
PM Security Breach: ప్రధాని మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మోడీ భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ ముందు విచారణకు డిమాండ్ చేశారు సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్. అయితే పిటిషన్ కాపీని కేంద్రం, పంజాబ్ ప్రభుత్వానికి అందించాలని.., సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్‌ను కోరింది అత్యున్నత ధర్మాసనం.
అదేవిధంగా పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు అంగీకరించింది. అంతేకాదు పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే మోడీ భద్రత ఉల్లంఘన అంశంపై విచారణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది పంజాబ్ సర్కార్. మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.