PM Kisan Scheme : రూ. 2 వేలు రాకపోతే ఇలా చేయండి!

PM Kisan Scheme : కరోనా లాంటి విపత్కరమైన సమయంలో కూడా రైతులకి అండగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోడీ.. కిసాన్

Update: 2020-08-09 09:45 GMT
PM Kisan Scheme

PM Kisan Scheme : కరోనా లాంటి విపత్కరమైన సమయంలో కూడా రైతులకి అండగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోడీ.. కిసాన్ సమ్మాన్ నిధి యోజన్ కు సంబంధించిన డబ్బులను ప్రధాని మోడీ ఈ రోజున విడుదల చేశారు. రూ. 17.100 కోట్ల నిధులను ప్రధాని విడుదల చేయగా, దేశవ్యాప్తంగా 8.69 కోట్ల మంది రైతులు బ్యాంకుల ఖాతాలలో ఈ డబ్బులు జమ కానున్నాయి. ఒక్కో రైతు ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున ఇవి జమ కానున్నాయి.

రెండు వేలు వాచ్చాయో లేదో చెక్ చేసుకోండి ఇలా..

అయితే అర్హులు అయిన రైతుల జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవడానికి Pmkisan.gov.in వెబ్సైటు లోకి వెళ్లి అక్కడ Farmers coroner లో Beneficiary status పైన క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేస్తే అర్హుల జాబితాలో మీ పేరుందో లేదో తెలుస్తోంది. ఒకవేళ మీరు లబ్దిదారులుగా ఉండి అకౌంట్లో డబ్బులు పడకపోతే మీ బ్యాంకు అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించండి.. అంతేకాకుండా PM-Kisan హెల్ప్ లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800115526 ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు

రైతుల కోసం ప్రత్యేక నిధి ;

ఇక అటు రైతుల కోసం ప్రధాని మోడీ కిసాన్ యోజన్ పథకం కింద రూ. లక్ష కోట్లతో పాటుగా వ్యవసాయ మౌలిక సదుపాయాలు నిధిని ప్రారంభించారు. పంట దిగుమతలను కాపాడుకునేందుకు అవసరమైన శీతల గిడ్డింగులతో పాటు సేకరణ కేంద్రాలను ఈ నిధి ద్వారా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రధానిమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులకి అందించే రుణాల పైన మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారెంటీ కల్పించానున్నారు. 


Tags:    

Similar News