పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi on Transparent Taxation Scheme: ట్యాక్స్ చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ కొత్త పన్ను పథకాన్ని ప్రారంభించారు. పారదర్శక పన్నువిధానం వేదికను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు.
PM Modi on Transparent Taxation Scheme: ట్యాక్స్ చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ కొత్త పన్ను పథకాన్ని ప్రారంభించారు. పారదర్శక పన్నువిధానం వేదికను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్నువిధానం అతుకులు లేకుండా, నొప్పి లేకుండా, పన్నుదారుడు నేరుగా హాజరు కాకుండా ఉండే విధంగా తయారు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. పన్నువిధానంలో భారీ సంస్కరణలను చేపడుతున్నట్లు చెప్పిన ప్రధాని.. నిజాయితీ పన్నుదారుడు ఎటువంటి వేదనకు గురికాకుండా చూస్తామన్నారు. ఆదాయపన్ను, కార్పొరేట్ పన్నులను తగ్గించినట్లు తెలిపారు. సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నవారిని మరింత్ ప్రోత్సహిస్తామన్నారు. ప్రత్యేక వేదిక ద్వారా ఫిర్యాదులు సులువుగా చేయవచ్చు అన్నారు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను విధానంలో మరిన్ని సంస్కరణలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పన్నుల సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. పన్ను చెల్లింపు దారులు మరింత పెరిగేందుకు ఈ వేదిక దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు.