PM Modi: అగ్రరాజ్య అధినేత జోబైడెన్‌తో ప్రధాని మోడీ భేటీ
PM Modi: ఆఫ్ఘాన్ వ్యవహారం, టెర్రరిజంపై కీలక చర్చ
PM Modi: అమెరికాలో పర్యటనలో భాగంగా బిజీ బిజీగా ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా బైడన్ ప్రమాణ స్వీకరణం చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ఇండియా-అమెరికా మధ్య ఉన్న సత్సంబంధాల గురించి ఈ సమావేశానికి ముందు బైడెన్ సంతృప్తి వ్యక్తం చేయగా ఇరు దేశాల మద్య వాణిజ్య అంశాలపై మోడీ ప్రధానంగా చర్చించారు.
మొదట శ్వేతసౌధంలో మోడీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్ మోడీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కొవిడ్-19పై పోరాటం సహా విస్తృత ప్రాధాన్యతా అంశాలపై శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో సుమారు గంటపాటు చర్చించారు. వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు. ఈ సమావేశం ఎంతో కీలకమైందన్న మోడీ.. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.