PM Modi Makes Another Record : ప్రధానిగా మోడీ కొత్త రికార్డు!
PM Modi Makes Another Record : దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డు సృష్టించారు. అత్యధికకాలం పాటు ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు.
PM Modi Makes Another Record : దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డు సృష్టించారు. అత్యధికకాలం పాటు ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. బీజేపీ నేత అటల్ బీహార్ వాజ్‌పేయి అన్ని ధపాల్లో కలిపి 2,268 రోజులు ప్రధానిగా పదవిలో ఉండగా, నేను మోడీ ఆ రికార్డును అధిగమించారు. మొత్తంగా ఈ విషయంలో మోడీ నాలుగో స్థానంలో నిలిచారు. నరేంద్ర మోడీ 2014 వ సంవత్సరం మే 26 న దేశ 14 వ ప్రధానిగా మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆ తర్వాత 2019 మే 30 న మళ్లీ ప్రధానిగా తన రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకూ ప్రధానిగా మోదీ ఆరేళ్లు పూర్తి చేశారు. మరో నాలుగేళ్ళు అయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
భారతదేశపు మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా ఉన్నారు. అతని పదవీకాలం సుమారు 17 సంవత్సరాలు కొనసాగింది. ఆ తరువాత అతని కుమార్తె ఇందిరా గాంధీ 15 సంవత్సరాల 350 రోజులు ప్రధానిగా పనిచేశారు. ఇక ఆ తర్వాత మన్మోహన్ సింగ్ వరుసగా రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు.
కాంగ్రెసేతర ప్రధానమంత్రులుగా మొరార్జీ దేశాయ్ (మార్చి 24, 1977 - జూలై 28, 1979), చరణ్ సింగ్ (జూలై 28, 1979 - జనవరి 14, 1980), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (డిసెంబర్ 2) , 1989 - నవంబర్ 10, 1990), చంద్ర శేఖర్ (నవంబర్ 10, 1990 - జూన్ 21, 1991), హెచ్డి దేవేగౌడ (జూన్ 1, 1996 - ఏప్రిల్ 21, 1997) మరియు ఇందర్ కుమార్ గుజ్రాల్ (ఏప్రిల్ 21, 1997 - - మార్చి 19, 1998)వరకు పనిచేశారు.