భారత్‌లో డ్రైవర్‌లెస్ ట్రైన్ పట్టాలెక్కింది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమెటెడ్ డ్రైవర్‌లెస్ రైలును ఢిల్లీలో ప్రారంభించారు ప్రధాని మోడీ. దీంతో ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్‌లో ఆటోమేటెడ్ రైలు పట్టాలపై పరుగులు తీస్తోంది. ఈ ట్రైన్‌లో కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది. ఎలాంటి మానవ ప్రమేయం ఉండదు. రైల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా CBTC టెక్నాలజీ సాయంతో వెంటనే పరిష్కరించవచ్చు. హార్డ్‌వేర్ రీప్లేస్‌మెంట్ సమయంలో మాత్రమే మనుషుల అవసరం ఉంటుంది. మిగతా అంతా ఆటోమేటిగ్గానే జరిగిపోతుంది. ప్రస్తుతం సరికొత్త హంగులతో పరుగులు పెడుతున్న ఈ రైలులో ప్రయాణించేందుకు ఢిల్లీ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.