పార్లమెంట్‌ సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం

*వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో రగడకు సమాధానం చెప్పాలని నిర్ణయం *మంత్రులు అమిత్‌షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్‌, ప్రహ్లాద్ జోషీ హాజరు *సోమవారం రాజ్యసభలో ప్రధాని మాట్లాడతారని సమాచారం

Update: 2021-02-05 11:43 GMT

మోడీ ఫైల్ ఫొటో 

పార్లమెంట్‌ సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో రగడకు సమాధానం చెప్పాలని నిర్ణయించిన మోడీ.... అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి

మంత్రులు అమిత్‌షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్‌, ప్రహ్లాద్ జోషీ తదితరులు హాజరయ్యారు. అయితే, వ్యవసాయ చట్టాలపై జరుగుతోన్న రగడపై సోమవారం రాజ్యసభలో ప్రధాని మాట్లాడతారని తెలుస్తోంది. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయనే భావనలో ఉన్న మోడీ ప్రభుత్వం.... గట్టిగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది.

ఇక, రేపు రహదారుల దిగ్బంధానికి రైతులు పిలుపునిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రధాని మోడీ చర్చించారు. ఢిల్లీ సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దులకు రైతులు భారీగా తరలి వస్తున్నారు. దాంతో ఢిల్లీ సరిహద్దులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Tags:    

Similar News