కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. సాగు చట్టాల అమలుతో నిరుద్యోగం ఎక్కువవుతుందని అన్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రాహుల్ పర్యటించారు. ఏదో ఒకటి ఎంచుకోండంటూ ప్రధాని కొన్ని ఆప్షన్లు చెబుతున్నారనీ, ఆ మూడు ఆప్షన్లలో ఒకటి ఆకలి, రెండవది నిరుద్యోగం, మూడవది ఆత్మహత్యలు అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.