PSLV C52: అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
PSLV C52: పీఎస్‌ఎల్‌వీ సీ-52 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
PSLV C52: పీఎస్‌ఎల్‌వీ సీ-52 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ఈఓఎస్ - 04 ఉపగ్రహం వ్యవసాయం, అటవీ, తోటలు, నేల తేమ, హైడ్రాలజీ, వరద మ్యాపింగ్ కోసం అన్ని వాతావరణ పరిస్థితులలో అధిక రిజల్యూషన్ చిత్రాలను అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.