PM Modi: ఇండియా ఫస్ట్, సిటిజెన్ ఫస్ట్ నినాదంతో బడ్జెట్ ఉంటుంది

PM Modi: యావత్ ప్రపంచం మొత్తం భారత బడ్జెట్‌వైపే చూస్తోంది

Update: 2023-02-01 01:51 GMT

PM Modi: ఇండియా ఫస్ట్, సిటిజెన్ ఫస్ట్ నినాదంతో బడ్జెట్ ఉంటుంది

PM Modi: ప్రపంచం మొత్తం భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వైపే చూస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ సెషన్ ప్రారంభమయ్యే ముందు పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన మోడీ..సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత బడ్జెట్..సామాన్య పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. భారత్ బడ్జెట్ ప్రపంచానికి ఆశాకిరణంగా ఉంటుందని మోడీ తెలిపారు. ప్రపంచం భారతదేశంపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా పెంపొందించేలా కృషి చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు.

Tags:    

Similar News