PM Modi: ఆ పిల్లలకి ప్రధాని మోదీ పెద్ద బహుమతి.. నెలవారీ స్కాలర్‌ షిప్‌ల అందజేత..!

PM Modi: కరోనా పీరియడ్ కింద తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద పెద్ద బహుమతిని అందించారు.

Update: 2022-05-31 13:30 GMT

PM Modi: ఆ పిల్లలకి ప్రధాని మోదీ పెద్ద బహుమతి.. నెలవారీ స్కాలర్‌ షిప్‌ల అందజేత..!

PM Modi: కరోనా పీరియడ్ కింద తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద పెద్ద బహుమతిని అందించారు. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య పథకం కింద పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పాస్‌బుక్‌తో పాటు ఆరోగ్య కార్డును అందజేశారు. ఇంతకుముందు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి గడువు డిసెంబర్ 31, 2021గా ఉండేది. అయితే ఈ గడువుని ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించారు.

మహారాష్ట్ర నుంచి అత్యధిక దరఖాస్తులు

ఇటువంటి పిల్లల నమోదు కోసం pmcaresforchildren.in అనే పోర్టల్ ప్రారంభించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ షేర్ చేసిన డేటా ప్రకారం మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1,158 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ నుంచి 768, మధ్యప్రదేశ్‌ నుంచి 739, తమిళనాడు నుంచి 496, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 479 దరఖాస్తులు వచ్చాయి.

కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకి ఈ ప్రయోజనాలు

1. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం 18 సంవత్సరాల వయస్సు వరకు నెలవారీ స్టైఫండ్ ఇస్తుంది.

2. దీని కింద పిల్లలకు 23 ఏళ్లు నిండినప్పుడు పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఏకమొత్తంగా రూ.10 లక్షలు ఇస్తారు.

3. ఈ పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యను అందజేస్తుంది.

4. దీని కింద పిల్లలు ఉన్నత విద్య కోసం రుణం పొందుతారు. దీని వడ్డీ PM కేర్స్ ఫండ్ నుంచి చెల్లిస్తారు.

5. ఈ పిల్లలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద 18 ఏళ్లపాటు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది.

6. బీమా ప్రీమియం PM కేర్స్ ఫండ్ నుంచి ఉంటుంది.

7. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సమీపంలోని కేంద్ర పాఠశాల లేదా ప్రైవేట్ పాఠశాలలో చేర్చవచ్చు.

8. 11 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయం వంటి ఏదైనా కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చవచ్చు.

9. పిల్లవాడు తన సంరక్షకుడితో లేదా ఇతర కుటుంబ సభ్యులతో నివసిస్తుంటే అతను సమీపంలోని కేంద్రీయ విద్యాలయం లేదా ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశం పొందుతాడు.

10. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తే విద్యా హక్కు చట్టం ప్రకారం అతని ఫీజులు PM కేర్స్ ఫండ్ నుంచి చెల్లిస్తారు. అతని పాఠశాల యూనిఫాం, పుస్తకాలు, కాపీల ఖర్చులు కూడా చెల్లిస్తారు.

Tags:    

Similar News