WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్

WHO: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందన్న WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

Update: 2021-07-17 15:20 GMT

WHO: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందన్న WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రానున్న100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వైరస్ సోకుతుండటంతో ఆందోళన పెరుగుతోంది. అందుకే కోవిడ్ నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైనట్టే మహారాష్ట్రలోని 8 ప్రాంతాల్లో ప్రమాద సూచికలు కన్పిస్తున్నాయి. అందుకే ఇదొక హెచ్చరికగా భావించాలని ప్రధాని మోడీ సైతం సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండోనేషియా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో కరోనా కేసులు అధికమవుతున్నాయి.

Tags:    

Similar News