కరోనా మహమ్మారిపై మనం చేసే యుద్దంలో కచ్చితంగా గెలుపు సాధిస్తామని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు (మర్చి 25) ఆయన వారణాసి పౌరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అందరూ ఇళ్ళకు పరిమితం అవడం ద్వారా కరోనాను ఓడించావచ్చని ఆయన చెప్పారు. '' సంక్షోభంలో ఉన్న దేశ ప్రజలను కాశీయే నడిపించగలదు. దేశానికి సహనం, కరుణ, శాంతిని కాశీయే నేర్పించగలదు. కరోనా ఎంత ప్రమాదకరమైందో ప్రజలు అర్థం చేసుకోవాలి'' అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ఇళ్లలోనే ఉండడం ద్వారా ఐకమత్యంతో కరోనాను తరిమికొట్టడం సాధ్యమే అని ప్రధాని మోడీ చెప్పారు. వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలని చెప్పారు. మనం యుద్ధం చేస్తున్నామనీ, ఆ యుద్దంలో గెలుపే లక్ష్యంగా సంఘటితంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. 31 రోజుల్లో కరోనాను దేశం నుంచి తరిమికొట్టి విజయం సాధించాలని చెప్పారు. మనస్సుతో ఆలోచిస్తే దేనికైనా మార్గం ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారణాసి ప్రజలతో అన్నారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కు సహ్కరించాలని కోరారు.