Dolo-650ని సిఫార్సు చేసేందుకు డాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు.. సుప్రీం సీరియస్‌..

Dolo 650: జ్వరం వచ్చినా.. ఒళ్లు నొప్పులు ఉన్నా.. ఇంకేదైనా.. డాక్టర్ దగ్గరకు వెళ్లినా.. మెడికల్‌ షాపుకు వెళ్లినా ఇచ్చేది.. ఆ ట్యాబ్లెటే..

Update: 2022-08-20 10:08 GMT

Dolo-650ని సిఫార్సు చేసేందుకు డాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు.. సుప్రీం సీరియస్‌..

Dolo 650: జ్వరం వచ్చినా.. ఒళ్లు నొప్పులు ఉన్నా.. ఇంకేదైనా.. డాక్టర్ దగ్గరకు వెళ్లినా.. మెడికల్‌ షాపుకు వెళ్లినా ఇచ్చేది.. ఆ ట్యాబ్లెటే.. డాక్టర్ కాకపోయినా.. అందరూ ఆ ట్యాబ్లెట్‌ వేసుకున్నావా? అని ఆరా తీస్తారు.. ఆ మాత్ర మరేదో కాదు.. డోలో.. ఈ పేరు దేశంలో ఎంతగా పాకిపోయిందంటే ప్రతి ఇంట్లో అదే ట్యాబ్లెట్ కనిపించేంతగా ఏ తలనొప్పో, జ్వరమో వస్తే హడావిడి పడడం ఎందుకని ముందస్తుగా డోలో ట్యాబ్లెట్లను పలువురు తెచ్చిపెట్టుకుంటారు. ఇప్పుడు ప్యారాసెటమాల్‌ అంటే డోలో-650 అన్నట్టుగా మారింది. అయితే ఈ ట్యాబ్లెట్‌ ఇంతలా ప్రచారం పొందడానికి కారణమేమిటి? అన్న ప్రశ్నకు తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు చాలా సింపుల్‌గా స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. అదేమిటంటే కేవలం ప్రచారం డోలోను డాక్టర్లు, మెడికల్‌ ప్రాక్టీషనర్లు విపరీతమైన ప్రచారం చేశారు. ఫలితంగా డోలో కంపెనీ నుంచి భారీగా నజరానాలను అందుకున్నారు. డోలో కంపెనీ డాక్టర్లకు ఇప్పటివరకు వెయ్యి కోట్ల రూపాయలను కానుకల రూపంలో లంచం ఇచ్చినట్టు ఆదాయపు పన్ను శాఖ తేల్చింది. అందుకే వారు డోలోనే ఎక్కువగా పేషెంట్లకు సూచించినట్టు నిర్ధారించింది.

డోలో వ్యవహారాన్ని వైద్య ప్రతినిధుల బృందం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తీసుకెళ్లింది. అయితే కోవిడ్‌ సోకిన సమయంలో తాను కూడా ఆ డోలో-650 టాబ్లెట్‌ వేసుకున్నట్టు తెలిపారు. మీలో కూడా చాలా మంది కరోనా సోకిన సమయంలో ఈ ట్యాబ్లెట్‌ తీసుకునే ఉంటారు. కరోనా సమయంలో రికార్డు స్థాయిలో డోలో-650 ట్యాబ్లెట్లను భారతీయులు వినియోగించారు. దీంతో ఈ ట్యాబ్లెట్‌ ప్రతి ఇంటికి చేరువయ్యింది. డోలో-650ని 1993లో మార్కెట్లోకి వచ్చింది. అతి తక్కువ కాలంలోనే 650 ఎంజీ నంబర్‌ వన్‌ పారాసెటమల్‌ బ్రాండ్‌గా మారింది. బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్‌ ఈ డోలోను తయారుచేసోతోంది. ఇది ప్రస్తుతం ఏటా 7 కోట్ల 50 లక్షల స్ట్రిప్స్‌ను విక్రయిస్తున్నది. కరోనా సమయంలో వీటి విక్రయాలు దూసుకెళ్లాయి. 2020 మార్చి నుంచి 2022 జనవరి వరకు 350 కోట్ల డోలో ట్యాబ్లెట్లను కొనుగోలు చేశారు. ఆ మొత్తం స్టాక్‌ను ఒకచోట పెడితే అత్యంత పెద్దదైన టవర్‌ బుర్జ్‌ ఖలీఫా ఎత్తున పెరుకుపోతాయట మొత్తం 567 కోట్ల రూపాయల విలువైన డోలో -650 ట్యాబ్లెట్లను మైక్రో ల్యాబ్స్‌ విక్రయించింది. ఇతర పారాసెటమాల్ ట్యాబ్లెట్ల విక్రయాలు కూడా పెరిగాయి. కానీ డోలోను మాత్రం అధిగమించలేకపోయాయి. 2021 డిసెంబరులో డోలో విక్రయాలు 61 శాతం ఉంటే క్యాల్‌ పాల్‌ 56 శాతం మాత్రమే.

అన్ని పారాసెటమాల్‌ ట్యాబ్లెట్ల కంటే డోలోనే అత్యధిక ధర. అయినా అవే భారీగా అమ్ముడయ్యాయి. ఒక్కో డోలో -650 ట్యాబ్లెట్‌ ధర రూపాయి 73 పైసలు. ధర ఎక్కువైనా ప్రజలు ఎందుకు డోలోనే కనుగోలు చేశారు? అంటే డాక్టర్లు సూచించడమే కారణం డాక్టర్లు లంచం తీసుకుని ఆ పని చేసినట్టు తెలుస్తోంది. వారికి మైక్రో ల్యాబ్స్‌ వెయ్యి కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టు ఆదాయపు పన్ను శాఖ తేల్చింది. దీంతో ఫార్మాలో అవినీతి బట్టబయలవుతోంది. జూన్‌లో డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ అథారిటీ - డీఎస్‌సీఏకు ఫార్మా కంపెనీ లంచం ఇవ్వచూపినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. డాక్టర్లు కేవలం కొన్ని బ్రాండ్లనే సూచిస్తారు. ఆ డాక్టర్లకు సంబంధమున్న స్టోర్లలో మాత్రమే ఆ ట్యాబ్లెట్లు దొరుకుతాయి. ప్రవేటు వైద్యశాలలో మెడిల్‌ రెప్రజెంటిటివ్స్‌ వచ్చి పోవడం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇదేమీ అక్రమం కాకపోవడంతో అక్కడే అసలు బాగోతాలకు తెరలేపుతోంది. తమ మెడిషన్‌‌ విక్రయాలను పెంచినందుకు ఫార్మా కంపెనీలు కానుకలు, యాత్రలు, నగదు రూపంలో బహుమతులను వైద్యులకు అందజేస్తాయి.

ఔషధ విక్రయాలను ప్రోత్సాహించిన డాక్టర్లకు బదులుగా ఫార్మా కంపెనీలు నజరానాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఫార్మా కంపెనీలు నజరానాలు ఇవ్వడాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో నిషేధించింది. అయితే ఫార్మా కంపెనీలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. అంతేకానీ డాక్టర్లు తీసుకోకూడదని చెప్పలేదు. అయితే డాక్లర్లు ఫార్మా కంపెనీల నుంచి బహుమతులను అందుకోవడాన్ని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా-ఎంసీఐ నిషేధించింది. అయినా ఇవేవీ పార్మా కంపెనీలు, వైద్యులు పట్టించుకోవడం లేదు. రోగులకు అవసరమైన మందులను కాకుండా తమకు కాసులు కురిపించే వాటినే వైద్యులు సూచిస్తున్నారు. దీంతో రోగాన్ని నయం కాకపోగా మరింత ముదిరే ప్రమాదం ఉంది. దీంతో ఫార్మా కంపెనీల యజమానులు కోటీశ్వరులుగా మారుతున్నారు. చట్టం ప్రకారం రోగికి ఏ మందును ఎందుకు ఇస్తున్నారో వివరించాల్సిందే. కానీ దీన్ని ఎవరూ పాటించడం లేదు. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2019లో డాక్టర్లు, మెడికల్‌ రెప్రజెంటేటివ్స్‌ ముఖాముఖిని ఇజ్రాయెల్‌ నిషేధించింది. 2020లో ఓ ఫార్మా కంపెనీపై 72 కోట్ల 90 లక్షల డాలర్ల జరిమానాను స్విజ్టర్లాండ్‌ ప్రభుత్వం విధించింది. భారత్‌లోనూ డాక్టర్లు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు ముఖాముఖిని నిషేధించి అనవసరమైన మందులను సూచించే వారిపైనా, ఫార్మా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

Tags:    

Similar News