Covid Third Wave: కోవిడ్ థర్డ్ వేవ్‌పై PGIMER సీరో సర్వే
Covid Third Wave: *2,700 మంది పిల్లల నమూనాలను టెస్ట్ చేసిన సర్వే * 71 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు వెల్లడి
Covid Third Wave: కరోనా థర్డ్ వేవ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీరో సర్వేలో వెల్లడైంది. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈ సర్వే నిర్వహించింది. 2వేల 700 మంది పిల్లల నమూనాలను టెస్ట్ చేయగా 71 శాతం మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి వెలువడిన సీరో సర్వేల్లో కూడా 50 నుంచి 75 శాతం మంది చిన్నారుల్లో యాంటీ బాడీలు ఉన్నట్లు స్పష్టమైంది. ఇక ఆరు నుంచి పది శాతం మందిలో బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్‌ను గుర్తించినట్లు PGIMER డైరెక్టర్ జగత్ రామ్ బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు.