EPFO: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ తప్పుపని అస్సలు చేయకండి..
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ తప్పుపని అస్సలు చేయకండి..
EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ అనేది ఉద్యోగుల కోసం ఏర్పడిన ఒక ప్రభుత్వ సంస్థ. ఇది ఉద్యోగులు రటైర్మెంట్ తర్వాత వారి ఆర్థిక అవసరాల కోసం ఏర్పాటు చేశారు. ఈ సంస్థ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ మంజూరు చేస్తుంది. కానీ ఇటీవల కొన్ని సైబర్ దాడుల వల్ల ఖాతాదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలియకుండా చేసిన పొరపాట్ల వల్ల ఖాతాలోని డబ్బును కోల్పోతున్నారు. నేరస్థులు వీరిని తెలివిగా బురిడి కొట్టించి వారి పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే ఈపీఎఫ్‌వో తన ఖాతాదారులను ఈ విషయంలో హెచ్చరిస్తుంది.
EPFO ఎప్పుడు ఖాతాలకు సంబంధించి వివరాలు అడగదని తెలిపింది. కాబట్టి ఎప్పుడు మీ సమాచారం ఫోన్ లేదా సోషల్ మీడియాలో షేర్ చేయకండి. EPFO ఒక ట్వీట్‌లో ఇలా రాసింది. ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా ఆధార్, పాన్, UAN, బ్యాంక్ ఖాతా లేదా OTP వంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయమని ఎవరైనా అడిగితే అది మోసంగా గుర్తించాలని కోరింది. అంతేకాదు ఏ సేవ కోసమైనా EPFO WhatsApp, సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా చెల్లింపులు చేయమని అడగదు.
మోసగాళ్లు తమ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని భావించి ఫిషింగ్ దాడి ద్వారా ఈపీఎఫ్‌వో ఖాతాలపై దాడి చేస్తున్నారు. ఫిషింగ్ అనేది ఆన్‌లైన్ మోసం దీనిలో ఖాతాదారుడిని బోల్తా కొట్టంచి అతని నుంచి ఖాతాకి సమాచారం సేకరించి డబ్బు కాజేస్తారు. అందుకే PANనంబర్, ఆధార్ నంబర్, UAN నెంబర్ ఎవ్వరితో షేర్ చేసుకోకూడదు. ఈ వివరాలు తెలియడం వల్ల మీరు డబ్బు కోల్పోతారు. ముఖ్యంగా ఉద్యోగాలు మారే సమయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతాయి.