Petrol Prices Hiked: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. వారంలో మూడో సారి
Petrol Prices Hiked:వాహనదారులను నిలువు దోపిడి చేసేలా పెట్రోల్ ధర మరో సారి పెరిగింది. రోజువారీ చమురు ధరల సమీక్షలో భాగంగా పెట్రోల్ ధరలను స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వరంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
Petrol Prices Hiked: వాహనదారులను నిలువు దోపిడి చేసేలా పెట్రోల్ ధర మరో సారి పెరిగింది. రోజువారీ చమురు ధరల సమీక్షలో భాగంగా పెట్రోల్ ధరలను స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వరంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.81.49కి చేరింది. నిన్న పెట్రోల్ ధర రూ.81.35గా ఉన్నది. ఇలా పెట్రోల్ ధరలు పెరగడం వారంలో మూడో సారి. అయితే పెట్రోల్ ధర పెరిగినా డీజిల్ ధర మాత్రం స్థిరంగానే ఉంది.. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.73.56. గా ఉంది.
అయితే, రాష్ట్రాల్లో పన్నులు ఒక్కోవిధంగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు మార్పులు ఉండనున్నాయి. కోల్‌కతాలో పెట్రోల్ రూ.83.01, డీజిల్ 77.06, ముంబై పెట్రోల్ రూ.88.16, డీజిల్ రూ.80.11, హైదరాబాద్ పెట్రోల్ రూ.84.55కు , డీజిల్ రూ.80.11 చెన్నైలో పెట్రోల్ రూ.84.52, డీజిల్ రూ.78.86.గా నమోదు అయ్యాయి.
అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.86.13కు చేరింది. డీజిల్ ధర రూ.81.32 వద్ద స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.85.70కు చేరింది. డీజిల్ ధర రూ.80.91 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.34 శాతం తగ్గుదలతో 44.30 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.21 శాతం క్షీణతతో 42.30 డాలర్లకు తగ్గింది. కానీ ఈ పెట్రోల్ ధరలు పెరగడం గమనర్హం.