Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Price Today: వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అయితే ఇది కేవలం దేశంలోని ప్రధాన నగరాలకే పరిమితమని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది.
దేశంలోని వివిధ నగరాల్లో...
దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 92.85 ఉండగా..డీజిల్ ధరలలోనూ మార్పులు లేవు ఇక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 83.51 వద్ద కొనసాగుతోంది. ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 99.14లు ఉండగా, డీజిల్ రూ. 90.71లు ఉంది. చెన్నైలో స్వల్ప మార్పు కనిపించింది ఇక్కడ శుక్రవారం లీటర్ పెట్రోల్ రూ. 94.64 గా నమోదుకాగా.. డీజిల్ రూ. 88.43 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులోనూ ఇంధన ధరల్లో మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.95.94 గా ఉండగా డీజిల్ ధర రూ. 88.53 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో …
హైదరాబాద్‌లో ఇంధన ధరల్లో మార్పులు పెద్దగా కనిపించలేదు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.50లు ఉండగా .. డీజిల్ ధర రూ. 91.04 వద్ద కొనసాగుతోంది. కరీంనగర్‌లో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 96.79లు నమోదుకాగా, డీజిల్ రూ. 91.30 వద్ద కొనసాగుతోంది. విజయవాడలోనూ ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 99.28లు ఉండగా, డీజిల్ రూ. 93.23 వద్ద కొనసాగుతోంది. విశాఖలో లీటర్ పెట్రోల్ రూ. 98.50 లుఉండగా, డీజిల్ రూ. 92.46 వద్ద కొనసాగుతోంది.