Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Rates Today: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Petrol, Diesel Price Today: లాక్‌డౌన్లు, కర్ఫ్యూల కారణంగా... ఇండియాలో పెట్రోల్ వాడకం తగ్గింది. అలాంటప్పుడు ధరలు తగ్గాలి. ఎన్నికల సమయంలో మాత్రం కాస్త శాంతించాయి. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం మళ్లీ పెరుగుదల కనింపించింది. అయితే ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదలల కనిపించలేదు.
ప్రధాన నగరాల్లో ...
దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.34 ఉండగా డీజిల్ రూ. 82.95 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.65 ఉండగా, డీజిల్ ధర రూ. 90.11 గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 94.18 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 87.89 గా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 95.41 గా ఉండగా, డీజిల్ రూ. 87.94 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
హైదరాబాద్‌లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 95.97 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.43 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.13 గా ఉండగా, డీజిల్ రూ. 90.57 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 98.56 గా (శనివారం రూ. 98.64 ) ఉండగా, డీజిల్ రూ. 92.46 (శనివారం రూ.92.53 ) వద్ద కొనసాగుతోంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.56 (శనివారం రూ.97.47 )ఉండగా, డీజిల్ రూ. 91.47 (శనివారం రూ. 91.39 ) గా నమోదైంది.