Petrol Diesel Price Today: వాడకం తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం మార్పులేదు

Petrol Diesel Price Today: తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు దేశ వ్యాప్తంగా ఎలా వున్నాయంటే...

Update: 2021-05-15 02:25 GMT

Petrol Diesel Price Today:(File Image) 

Petrol Diesel Price Today: లాక్‌డౌన్లు, కర్ఫ్యూల కారణంగా... ఇండియాలో పెట్రోల్ వాడకం తగ్గింది. ప్రయాణాలు తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శనివారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ...

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.34గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.95 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.65కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.11 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.44 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 85.79గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 94.17 ఉండగా.. డీజిల్ ధర రూ.87.90గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.87.94 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.08ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.83.21 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.97గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 90.43గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.12 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.90.56 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 96.40గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.81 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.98గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.70గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.47ఉండగా.. డీజిల్ ధర రూ.90.89 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.52 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 98.64కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.53 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 97.67 ఉండగా.. డీజిల్ ధర రూ.90.39గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.38లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.92.24 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.14 గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.07గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 98.64లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.92.53 లకు లభిస్తోంది.

Tags:    

Similar News