Petrol And Diesel Rates: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Rates: ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
Petrol And Diesel Rates: ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.100కు చేరువైంది. మరికొన్ని చోట్ల వంద దాటింది. దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే.. భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళనలు చేశాయి. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో గడిచిన కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. దీంతో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో...
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.56 ఉండగా, డీజిల్ ధర రూ.80.87 గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.77, డీజిల్ ధర రూ.83.75 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.98 ఉండగా, డీజిల్ ధర రూ.87.96 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.71 ఉండగా, డీజిల్ ధర రూ.86.01 ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.93.59 ఉండగా, డీజిల్ ధర రూ.85.75 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.56 ఉండగా, డీజిల్ ధర రూ.90.38 గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.39 గా ఉండగా, డీజిల్ ధర రూ.89.87గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.85 గా ఉండగా, డీజిల్ ధర రూ.89.37గా ఉంది.
తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.16 ఉండగా, డీజిల్ ధర రూ.88.94 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.74 ఉండగా, డీజిల్ ధర రూ.87.80 ఉంది.