Petrol Price: స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price: గత 4 రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు స్వల్పంగా దిగొచ్చాయి.
Petrol Price: గత 4 రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 25 పైసలు చొప్పున తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ ధర రూ.94.16కు, డీజిల్ ధర రూ.88.20కు క్షీణించింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 22 పైసలు తగ్గుదలతో రూ.96.65కు క్షీణించింది. డీజిల్ ధర 24 పైసలు క్షీణతతో రూ.90.17కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 22 పైసలు తగ్గుదలతో రూ.96.91కు క్షీణించింది. డీజిల్ ధర 25 పైసలు క్షీణతతో రూ.90.42కు తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 22 పైసలు తగ్గుదలతో రూ.90.56కు క్షీణించింది. డీజిల్ ధర 23 పైసలు క్షీణతతో రూ.80.87కు తగ్గింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 21 పైసలు తగ్గుదలతో రూ.96.98కు క్షీణించింది. డీజిల్ ధర 24 పైసలు క్షీణతతో రూ.87.96కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.42 శాతం తగ్గుదలతో 64.78 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.03 శాతం క్షీణతతో 61.53 డాలర్లకు తగ్గింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి.