రామసేతను వారసత్వ కట్టడంగా గుర్తించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
*వచ్చేవారంలో విచారణ చేపడుతామన్న కోర్టు
Rama Setu: రామసేతు లంకలో ఉన్న సీత వద్దకు రాముడిని చేర్చేందుకు వానరసేన నిర్మించిన వంతెన. దీన్ని వారసత్వ కట్టడంగా గుర్తించాలని మాజీ బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వచ్చే వారం వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. గతంలోనే రామసేతుపై సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్ వేసినా ఇన్నాళ్లు సుప్రీం పెండింగ్‌లో పెట్టింది. అత్యవసరంగా రామసేతు పిటిషన్ విచారణ చేపట్టాలంటూ తాజాగా మరోసారి సుబ్రహ్మణ్యం స్వామి కోరారు. దీంతో సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. రామసేతను వారసత్వ కట్టడంగా గుర్తించేలా నేషనల్ మోనోమెంట్ అథారిటీ-ఎన్‌ఎంఏతో పాటు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనలో కోరారు.
రామసేతుపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పూర్తి సర్వే చేయాలని సుబ్రహ్మణ్యం స్వామి కోరారు. ఇప్పటికే రామసేతును కేంద్రం గుర్తించింది. ఈ విషయమై 2017లోనే సమావేశం జరిగింది. అప్పటి నుంచి రామసేతును వాసరత్వ కట్టడంగా గుర్తించాలని సుబ్రహ్మణ్యంస్వామి డిమాండ్ చేస్తున్నారు. ఈ రామసేతు ప్రస్తుతం భారత్, శ్రీలంక మధ్యన పాక్ జలసంధిలో ఉంది. దక్షిణ తమిళనాడు తీరంలోని రామేశ్వరం నుంచి ఉత్తర శ్రీలంక తీరానికి కలుపుతూ వంతెనలాంటి నిర్మాణ ఆనవాళ్లు ఉన్నాయి. దీన్ని రామసేతుపై రామాయణంలోనే ప్రస్తావన ఉంది. సీతను రావణుడు అపహరించి లంకలోని అశోకవనంలో బంధించాడు. హనుమంతుడి ద్వారా సమాచారం అందుకున్న రాముడు లంకకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వానర సేన ఓ వంతెనను నిర్మించింది. దాన్నే రామసేతుగా పిలుస్తారు. రామసేతు మానవ నిర్మితమేనని గతంలో నాసా ప్రకటించింది.