Supreme Court: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై సుప్రీంకోర్టులో పిటిషన్
Supreme Court: ప్రారంభించేందుకు ప్రధాని సిద్దమవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్
Supreme Court: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాని మోడీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయవాది దాఖలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా.. ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలయ్యింది. ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.