బిహార్‌లో ఆర్జేడీ కూటమిదే గెలుపు : పీపుల్స్ పల్స్
బిహార్‌లో ఆర్జేడీ కూటమి విజయకేతనం ఎగురవేయనుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని పీపుల్స్ సర్వే ఖరాఖండిగా ప్రకటిస్తోంది.
బిహార్‌లో ఆర్డేడీ కూటమి విజయకేతనం ఎగురవేయనుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని పీపుల్స్ సర్వే ఖరాఖండిగా ప్రకటిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 85 నుంచి 95 మంది సీట్లను కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడిస్తోంది. సెకెండ్ ప్లేస్‌లో బీజేపీ 65 నుంచి 75 సీట్లు సాధిస్తుందని చెబుతోంది. ఇక కాంగ్రెస్ 15 నుంచి 20 సీట్లతో, జేడీయూ 25 నుంచి 35 సీట్ల వరకు సర్ధిపెట్టుకుంటాయని పీపుల్స్ పల్స్ చెబుతోంది.
అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో 19 జిల్లాల్లో 78 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ సీట్లకు వెయ్యి 2వందల 4 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పోలింగ్ సమయం 5 గంటలకే ముగిసినప్పటికీ.. క్యూలైన్లో నిలబడిన వారికోసం.. కొవిడ్ పేషంట్ల కోసం పోలింగ్ సమయం 6.గంటల వరకు కొనసాగించారు. చివరి విడత ఎన్నికల్లో 2కోట్ల 34లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరి విడత ఎన్నికల్లో నితీష్ సహా 12మంది ప్రముఖులు పోటీలో నిలబడ్డారు. రెండో దశ పోలింగ్‌లో తేజస్వి యాదవ్ పోటీలో నిలిచారు. ఇదిలా ఉండగా.. ఇవే తనకు చివరి ఎన్నికలని నితీష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే..