Manipur Terror Attack: మణిపూర్‌లో మళ్లీ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ కదలికలు..?

* ఘటనలో పాలుపంచుకున్న పీపుల్స్‌ ఫ్రంట్‌ ఉగ్రసంస్థ * ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన భద్రతా దళాలు

Update: 2021-11-15 03:24 GMT

మణిపూర్‌లో మళ్లీ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ కదలికలు(ఫైల్ ఫోటో)

Manipur Terror Attack: మణిపూర్‌లో అస్సాం బెటాలియన్‌ ఆఫీసర్‌ విప్లవ్‌ త్రిపాఠి కుటుంబం హత్యతో "PLA" పేరు మరోసారి బయటకు వచ్చింది. మణిపూర్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ కూడా ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే కొన్ని దశాబ్దాలుగా ఈ ఉగ్ర సంస్థ ఈశాన్య భారతంలో అరాచకం సృష్టిస్తోంది. దీని వెనుక విదేశీ శక్తులు కూడా ఉన్నాయనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాగా విప్లవ్ త్రిపాఠి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు యత్నాలను వేగవంతం చేశాయి.

' పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ' మణిపూర్‌లోని ఓ ఉగ్ర సంస్థ. దీనిని 1978లో ప్రారంభించారు. UNLF నుంచి వేరుపడి దీనిని ఏర్పాటు చేశారు. 1979లో దీని రాజకీయ విభాగం RPFను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మణిపూర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత్‌ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చాలన్నది దీని లక్ష్యం. ఇందుకోసం కుకీ, నాగా వేర్పాటువాద బృందాలతో కలిసి పనిచేసేందుకు "PLA" సిద్ధపడింది.

ఇంఫాల్‌ లోయలో "PLA" ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ గ్రూప్‌కు సంబంధించిన కీలక క్యాంప్‌లు మయన్మార్‌లో ఉన్నాయి. వీరి శిక్షణ కూడా ఇక్కడే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా 1990ల్లో నాగాలు, కుకీల మధ్య ఘర్షణల సమయంలో మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ ఉగ్ర సంస్థలు వీరిని లక్ష్యంగా చేసుకోలేదు.

విప్లవ్‌ త్రిపాఠి కుటుంబంపై హత్య తర్వాత వాహనంలో కమాండింగ్‌ ఆఫీసర్‌ భార్య, కుమారుడు ఉన్న విషయం తెలియదని చెప్పాయి. ఇక దాదాపు ఐదారేళ్లుగా స్తబ్దుగా ఉన్న "PLA" ఒక్కసారిగా భారీ దాడి చేయడం భద్రతా దళాలను కలవర పరుస్తోంది.

అయితే ప్రస్తుతం మణిపూర్‌లో మొత్తం ఆరు గ్రూపులు చురుగ్గా ఉన్నాయి. ఇవన్నీ మయన్మార్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయి. వసూళ్లకు పాల్పడి ఆనిధులతో ఆయుధాలు కొనుగోలు చేస్తోన్నాయి.

Tags:    

Similar News