కన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..

Graduate Chai Wali: బిహార్‌లో గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీగా ప్రసిద్ధి చెందిన ప్రియాంక గుప్తా కన్నీటి పర్యంతమైంది.

Update: 2022-08-19 15:45 GMT

కన్నీటి పర్యంతమైన ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’.. డిప్యూటీ సీఎం సాయం..

Graduate Chai Wali: బిహార్‌లో గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీగా ప్రసిద్ధి చెందిన ప్రియాంక గుప్తా కన్నీటి పర్యంతమైంది. తాను జీవనోపాధి కోసం నడుపుతున్న టీ స్టాల్​ను పాట్నామున్సిపల్​అధికారులు తీసేయడంతో వెక్కివెక్కి ఏడ్చింది. ఈ అంశం మీడియాలోనూ వైరల్​అయింది. తనకు సాయం చేయాలంటూ ప్రియాంక గుప్తా నేరుగా డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లను కలిశారు. దీంతో వారు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

తేజస్వి యాదవ్​ఆదేశాల మేరకు ప్రియాంక గుప్తా టీ స్టాల్‌ను మున్సిపల్​అధికారులు పునరుద్ధరించారు. ఈ పరిణామంపై 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' సంతోషం వ్యక్తం చేసింది. బిహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన ప్రియాంక కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. అయితే నెలల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె టీ స్టాల్​పెట్టాలని నిర్ణయించుకుంది. 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' పేరిట పాట్నాబోరింగ్ రోడ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ టీ స్టాల్ ఫేమస్ అయింది.

Tags:    

Similar News