పార్లమెంటు సమావేశాలు కుదించే అవకాశం..! నిర్ణయం ఆరోజే..

ప్రభుత్వ ప్రతినిధులతో పాటు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిగి ఉన్న.. స్పీకర్ అధ్యక్షతన జరిగే లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో, చాలా రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 14 న ప్రారంభమైన..

Update: 2020-09-20 03:11 GMT

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదించే అవకాశం ఉంది.. వచ్చే వారం నాటికి సమావేశాలు ముగిసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. COVID-19 ముప్పు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిగి ఉన్న.. స్పీకర్ అధ్యక్షతన జరిగే లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో, చాలా రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 14 న ప్రారంభమైన ఈ సెషన్స్ ను తగ్గించడానికి మొగ్గు చూపుతున్నాయి. దీనిపై అక్టోబర్ 1న పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులు సహా ఇప్పటివరకు మూడు బిల్లులను ఆమోదించింది లోక్‌సభ.

అలాగే, COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో నిధుల సేకరణకు ఎంపీల జీతాలను 30 శాతం తగ్గించే ఆర్డినెన్స్‌ను భర్తీ చేసే బిల్లును ఉభయ సభలు క్లియర్ చేశాయి. శనివారం అంటువ్యాధి సవరణ బిల్లు 2020కి కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అంటువ్యాధి సమయంలో దేశంలోని వైద్యులు, నర్సులు, ఆశా కార్మికుల రక్షణ కోసం ఈ బిల్లు వీలు కల్పిస్తుంది, వీరిపై దాడి చేసిన వారికి కఠినమైన శిక్షలు పడతాయి. ఇదిలావుంటే సమావేశాలు ప్రారంభమైన తరువాత కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ పటేల్ సహా కొందరు పార్లమెంటు సభ్యులు COVID-19 కు పాజిటివ్ గా తేలడంతో, కొన్ని ప్రతిపక్ష పార్టీలు18 రోజుల పూర్తి సెషన్ నిర్వహించడం ప్రమాదకర వ్యవహారం అని ప్రభుత్వానికి తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News