ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Parliament Session: *షెడ్యూలు ప్రకారం 8 వరకు సమావేశాలు *ఒక రోజు ముందే ముగించిన ప్రభుత్వం

Update: 2022-04-07 07:08 GMT

ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Parliament Session: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు షెడ్యూలు కంటే ఒక రోజు ముందే వాయిదా పడ్డాయి. ఈనెల 8 వరకు సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందే ముగించింది. దీంతో ఉబయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించారు. జనవరి 31న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభ కాగా ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

అనంతరం ఫిబ్రవరి 11న మొదటి విడత సమావేశాలు ముగిశాయి. ఆ తరువాత యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. మార్చి 10న ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం.. మార్చి14న రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూలు ప్రకారం ఈ సమావేశాలు ఏప్రిల్‌ 8 వరకు కొనసాగించాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందే పార్లమెంట్‌లోని ఉభయ సభలు వాయిదా పడ్డాయి.  

Tags:    

Similar News