ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన
*కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం
Parliament: పార్లమెంట్ లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం చేస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ధరల పెరుగుదల, ఈడీ తదితర సంస్థల దుర్వినియోగంపై చర్చకు పట్టుపడుతూ అపోజిషన్ లీడర్స్ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఉభయ సభలను కాసేపు వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష నేతలు నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్ ప్లకార్డుల నినాదాలతో హోరెత్తించారు. తక్షణమే గ్యాస్ సిలిండర్ భారాన్ని పేదలపై తగ్గించాలని డిమాండ్ చేశారు.