Parliament Monsoon Sessions: పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాటు.. సెప్టెంబర్‌లో సమావేశాలు!
Parliament Monsoon Sessions: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపధ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్యసభ ఎంపీలకు లోక్‌సభలో సీటింగ్ ఏర్పాట్లు చేశారు.
Parliament Monsoon Sessions: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపధ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్యసభ ఎంపీలకు లోక్‌సభలో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. కరోనా నేపధ్యంలో భౌతిక దూరం పాటిస్తూ సీట్లు సిద్దం చేస్తున్నారు. రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేసి వైరస్‌ను హతమార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందుకు సంబంధించిన పనులన్నీ ఆగస్ట్ మూడో వారంకల్లా పూర్తి చేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ మూడో వారంలో పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో లోక్ సభ, రాజ్య సభల చాంబర్లు, గ్యాలరీలల్లో సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజ్యసభ కార్యదర్శి వెల్లడించారు.
ఉదయం లోక్‌సభ, సాయంత్రం రాజ్యసభ సమావేశాలు జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు జరుగుతుంది. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు కోనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సమావేశాలను నియమాలకు అనుగుణంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి, కానీ ఈ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాలేదు.