Parliament Monsoon Session 2020: పార్లమెంటు మాన్సూన్ సెషన్ నిర్వహిస్తాం : కేంద్ర మంత్రి

Parliament Monsoon Session 2020: మాన్సూన్ సెషన్ మీటింగ్స్ ఖచ్చితంగా జరుగుతాయని.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి అన్నారు.

Update: 2020-07-12 07:29 GMT
Parliament Monsoon Session 2020

Parliament Monsoon Session: మాన్సూన్ సెషన్ మీటింగ్స్ ఖచ్చితంగా జరుగుతాయని.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి అన్నారు. పార్లమెంటు సమావేశాల నిర్వహణపై ఆదివారం మాట్లాడిన ఆయన.. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు, సామాజిక దూర ప్రమాణాలను పాటిస్తూ ప్రభుత్వం సమావేశాలను నిర్వహిస్తుందని చెప్పారు. అయితే ఈ సమావేశాలు ఎప్పుడు, ఏ రూపంలో, ఎంతకాలం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి గత వారం చెప్పిన సంగతి తెలిసిందే.

మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పార్లమెంటు సమావేశాలను నిర్వహించడం గురించి సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు సీటింగ్ ఏర్పాట్లను ఖరారు చేయాలని ఉభయ సభల సెక్రటరీ జనరల్స్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనావైరస్-సంబంధిత ప్రోటోకాల్ ఎలా విధించవచ్చో అంచనా వేయడానికి ఇటీవలి అధికారుల కమిటీ సమావేశమైంది. దీనికి ఉభయ సభల అధికారులు హాజరయ్యారు.

చాలా మంది సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు పార్లమెంటు సమావేశాలు జరపాలని పట్టుబడుతున్నారు. ఈ తరుణంలో సభలను వర్చువల్ గా నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వం అంత ఆసక్తి కనబరచలేదు. ఈ నేపథ్యంలో త్వరలో మాన్సూన్ సెషన్ జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రకటించడంతో ప్రతిపక్షాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి.



Tags:    

Similar News