Panipuri: పానీపూరీపై నిషేధం.. ఎందుకో తెలుసా?

Panipuri: చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పానిపూరిని ఇష్టపడని వారు ఉండరు.

Update: 2022-06-28 07:29 GMT

Panipuri: పానీపూరీపై నిషేధం.. ఎందుకో తెలుసా?

Panipuri: చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పానిపూరిని ఇష్టపడని వారు ఉండరు. సాయంత్రమైతే చాలు రోడ్డు పక్కన ఉన్న పానీపూరీ బండి దగ్గర గప్‌చుప్‌లు లాగించేయడానికి పిల్లలు కాచుకుని ఉంటారు. అయితే సుచి, శుభ్రత ఉంటే పర్వాలేదు కానీ ఎలా పడితే అలా ఉంటే మాత్రం అనేక రోగాలను కూడా తెస్తుంది. ఇప్పుడు ప్రబలుతున్న రోగాల కారణంగా ఓ ప్రాంతంలో అస్సలు పానీపూరి అనేది కనిపించకుండా నిషేదించింది ప్రభుత్వం. కాఠ్‌మాండూ వ్యాలీలో కలరా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాఠ్ మండూ వ్యాలీలోని లలిత్ పుర్ లో 12 కేసులు వెలుగు చూడటంతో పానీపూరీ మీద నిషేధం విధించింది. పానీపూరీలలో ఉపయోగించే నీళ్లలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News