మోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
Imran Khan: భారత్ పై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. మోడీ సర్కారు పెట్రోల్ ధరలను తగ్గించడాన్ని అభినందించారు. రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేయడం వల్లే అది సాధ్యపడిందన్నారు. అదే సమయంలో స్వదేశంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై అక్కడి కరెన్సీ రూపాయల్లో 30న చొప్పున పెంచింది.
ఇంధనంపై సబ్సీడీ భారాన్ని తగ్గించుకునేందుకు..అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి సాయం పొందేందుకు ఇలా చేసింది. దీంతో అసమర్ద, నిస్రహ ప్రభుత్వమని విమర్శిస్తూ రష్యా నుంచి 30శాతం తక్కువకు చమురు డీల్ చేసుకోలేకపోయారని ఇమ్రాన్ విమర్శించారు. దీనికి భిన్నంగా అమెరికా వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్..రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేసి పాక్ కరెన్సీలో లీటర్ పై 25 రూపాయలు తగ్గించిందని గుర్తు చేశారు.