మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్..

Update: 2020-09-28 12:05 GMT

కుక్కతోక వంకర.. పాకిస్థాన్ బుద్ధి మారుతుంది అని ఆశించడం అనవసరమైన పని.. సరిహద్దు వద్ద ఉన్న నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా.. పదే పదే కాల్పులకు తెగబడుతూ భారత సైనికులను రెచ్చగొడుతోంది పాక్.. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట చిన్న ఆయుధాలతో కాల్పులు, మోర్టార్లతో షెల్లింగ్ చేయడం ద్వారా పాక్ అప్రకటిత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

అయితే భారత సైన్యం కూడా తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటోంది అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ దేవేందర్ ఆనంద్ అన్నారు. 2020 జనవరి నుండి పాకిస్తాన్ నియంత్రణ రేఖపై 3,186 కాల్పుల విరమణ ఉల్లంఘనలలో 24 మంది పౌరులు మరణించారు.. 100 మందికి పైగా గాయపడ్డారు. సరిహద్దు షెల్లింగ్ నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజల జీవితాలలో అధిగమించలేని బాధలను తెచ్చిపెట్టింది, నియంత్రణ రేఖ అంతటా బుల్లెట్ల వర్షం పడుతుండటంతో వీరు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 

Tags:    

Similar News