Chidambaram : నిర్మలా దీనికి సమాధానం చెబుతుందా?
Chidambaram : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్థిక వ్యవస్థపై చేసిన 'యాక్ట్ ఆఫ్ గాడ్'
Chidambaram : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్థిక వ్యవస్థపై చేసిన 'యాక్ట్ ఆఫ్ గాడ్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ అర్ధిక శాఖ మంత్రి పి చిదంబరం స్పందించారు.. నిర్మలా సీతారామన్ ను 'దైవదూత' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు చిదంబరం.. " కరోనా మహమ్మారి 'దైవ ఘటన' అయితే.. కరోనా మహమ్మారి దేశాన్ని తాకడానికి ముందు 2017-18 2018-19 మరియు 2019-20 మధ్య ఆర్థిక వ్యవస్థ యొక్క దుర్వినియోగాన్ని ఎలా వివరిస్తారు? దైవదూతగా ఆర్థిక మంత్రి దీనికి దయచేసి సమాధానం ఇస్తుందా? అంటూ చిదంబరం ట్వీట్ చేశారు. అంతేకాకుండా 2018-19 రెండో త్రైమాసికంలో 7.1శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2019-20 నాలుగో త్రైమాసికంలో 3.1 శాతానికి క్షీణించడాన్ని మరో ట్వీట్ లో ప్రస్తావించారు చిదంబరం..
If the pandemic is an 'Act of God', how do we describe the mismanagement of the economy during 2017-18 2018-19 and 2019-20 BEFORE the pandemic struck India? Will the FM as the Messenger of God please answer?
— P. Chidambaram (@PChidambaram_IN) August 29, 2020
గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..జీఎస్టీ వసూళ్లపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. ఈ ఏడాది అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కోవిడ్ అనేది యాక్ట్ ఆఫ్ గాడ్. కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు తగ్గిందని అన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల కోట్లు జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.65వేల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు.. అయితే, కరోనావైరస్ సంక్షోభ సమయంలో జీఎస్టీలో వచ్చిన నష్టానికి కేంద్రం రాష్ట్రాలకు పూర్తిగా పరిహారం చెల్లించాల్సి ఉందని ప్రభుత్వ ఉన్నత న్యాయవాది అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ తెలిపారు.