Covishield Third Dose: కొవిషీల్డ్ మూడో డోసు భేష్!
Covishield Third Dose: రెండో డోసు తర్వాత ఆర్నెల్లకు ఇవ్వాలి మొదటి 2 డోసులకు నడుమ 45 వారాలు
Covishield Third Dose: కొవిషీల్డ్ టీకా మొదటి డోసుకు రెండో డోసుకు నడుమ 45వారాలు తేడా ఉంటే ఇంకా బాగా పనిచేస్తుందని.. రెండో డోసు వేసుకున్న ఆరు నెలల తర్వాత మూడో డోసు వేసుకుంటే యాంటీబాడీస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది. తమ అధ్యయనంలో.. మొదటి డోసుకు రెండో డోసుకు నడుమ 10 నెలల తేడాతో 'అద్భుతమైన స్పందన' కనిపించిందని తెలిపింది.
అయితే.. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాతో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావలు కనిపిస్తుండడంతో.. దానిపై ఇప్పటికే చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. కొన్ని దేశాలు పరిమితంగా వినియోగిస్తున్నాయి. యూకేలోనే మొదటి డోసు ఆక్స్‌ఫర్డ్ టీకా వేసిన చాలా మందికి రెండో డోసు కింద ఫైజర్ టీకా ఇచ్చారు. ఫ్రాన్స్, ఇటలీ, కొన్ని స్కాండినేవియన్ దేశాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. తమ టీకా మూడో డోసు వేసుకుంటే మంచిదని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ప్రకటించింది.