ఒకే అపార్టుమెంటులో 103 మందికి కరోనా

Update: 2021-02-16 16:00 GMT

దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలకు చెందిన మ్యుటేషన్‌ చెందిన కరోనా వైరస్‌లు భారత్‌లో ప్రవేశించాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ కొత్త స్ట్రెయిన్లను కనుగొన్నట్లు ICMR ప్రకటించింది. ఇండియాలో రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలకు చెందిన వైరస్‌లు కలకలం రేపుతున్నాయి. యూకే స్ట్రెయిన్‌ మనదేశంలో 187 మందికి వ్యాపించింది. ఇప్పటికే యూకే స్ట్రెయిన్‌ 82 దేశాలకు..దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ 41 దేశాలకు పాకాయి. తొలిరోజుల్లో వ్యాపించిన కరోనా కంటే ఇవి 70 శాతం వేగంగా వ్యాపిస్తాయి. అయితే కొత్త వైరస్‌లు ఉన్నట్లు కనుగొన్నవారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి గమనిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే ..బెంగళూరులోని ఒక భారీ గేటెడ్‌ కమ్యూనిటీలో వంద మందికి పైగా కరోనా వ్యాపించింది. పాజిటివ్‌ వచ్చినవారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచారు.

Tags:    

Similar News