కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మార్గం సుగమం

Jammu and Kashmir: ఉత్తరాది మంచుకొండల్లో రగులుతున్న మంటల్ని ఆర్పడానికి మోడీ సర్కార్‌ నడుం బిగించింది.

Update: 2021-06-24 15:22 GMT

కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మార్గం సుగమం

Jammu and Kashmir: ఉత్తరాది మంచుకొండల్లో రగులుతున్న మంటల్ని ఆర్పడానికి మోడీ సర్కార్‌ నడుం బిగించింది. కశ్మీర్‌ అభివృద్ధే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ తయారీకి సిద్ధమైంది. జమ్ము కశ్మీర్‌కు చెందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపింది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులతో సహా మొత్తం 14 మంది నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన భేటీలో, హోం మంత్రి అమిత్‌షా, కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కూడా పాల్గొన్నారు. మూడున్నర గంటల పాటు సాగిన సమావేశం పట్ల అటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, కశ్మీర్‌ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ముందు మొత్తం 5 డిమాండ్లు పెట్టినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్‌ చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలి. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలి. 370 అధికరణం రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో అరెస్ట్‌ చేసిన రాజకీయ కార్యకర్తలందరినీ విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసినట్లు ఆజాద్‌ తెలిపారు.

కశ్మీర్‌కు చెందిన ఆరు ప్రాంతీయ, అతివాద పార్టీలు గుప్‌కార్‌ డిక్లరేషన్‌గా ఒక గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఈ చర్చల్లో వారంతా ప్రభుత్వ వైఖరితో సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రధానితో జరిగిన సమావేశం సామరస్యపూర్వక వాతావరణంలో జరిగినట్లు కశ్మీరీ నేత బుఖారీ చెప్పారు. మొత్తం మీద సమావేశం విజయవంతంగా జరిగిందని నేతల మాటలను బట్టి తెలుస్తోంది. కశ్మీర్‌కు ఏదో ఒక సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని రెండేళ్ళ క్రితమే పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని రాష్ట్ర నేతలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ప్రధాని చెప్పినట్లు నాయకులు తెలిపారు.

Tags:    

Similar News