Jharkhand CM to BCCI : ధోని కోసం ఒక్క ఫేర్ వెల్ మ్యాచ్ పెట్టండి : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి
Jharkhand CM to BCCI : ఎంఎస్ ధోని.. ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా... దాదాపుగా 16ఏళ్ళు టీంఇండియా
Jharkhand CM to BCCI : ఎంఎస్ ధోని.. ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా... దాదాపుగా 16ఏళ్ళు టీంఇండియా జట్టుకు విశేషమైన సేవలను అందించిన ధోని అందరికి షాక్ ఇస్తూ నిన్న (ఆగస్టు 15)న తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.. వాస్తవానికి గత ఏడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్ తర్వాత ధోని దాదాపుగా జట్టుకు ఏడాది పాటు దూరంగా ఉన్నాడు. ఇక ఎవరు ఉహించిన విధంగా నిన్న రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు.. ఇక కేవలం ధోని ఐపీఎల్ లో మాత్రమే ధోని ఆడనున్నాడు.
ధోని అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నారు.. ఆటగాడిగా, కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోని ప్రస్థానం ఇంత సింపుల్ గా ముగిసిపోవడం ఏంటి? కచ్చితంగా ధోనికి మంచి వీడ్కోలు ఉండాలి.. ఒక్క ఫేర్ వెల్ మ్యాచ్ అయిన కచ్చితంగా ఉండి తీరాలని సగటు అభిమాని కోరుకుంటున్నాడు.. ఇదే అలోచనని ధోనీ స్వరాష్టమైన జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా అనుకున్నారు..
భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించిన ధోని కోసం, మరియు అతని ఫ్యాన్స్ కోసం ఒక్క ఫేర్ వెల్ మ్యాచ్‌ని పెట్టాలని ఆయన బీసీసీఐని కోరారు. ఈ మ్యాచ్ కి రాంచీ స్టేడియం ఆతిధ్యం ఇస్తుందని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని అభిమానలందరి కోసం ఈ మ్యాచ్ ని పెట్టాలని అయన అన్నారు.. మంత్ సోరెన్ అభ్యర్థనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి మరి..