OBC Bill: ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాలు గ్రీన్ సిగ్నల్

OBC Bill: ఆందోళన చేయబోమన్న నేతలు * ఇవాళ ప్రవేశ పెట్టబోయే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్ధతు

Update: 2021-08-09 08:06 GMT

ఓబీసీ బిల్లుకు ఒకే చెప్పిన ప్రతిపక్షాలు (ఫైల్ ఇమేజ్)

OBC Bill: పెగాసస్ స్పైవేర్ పై విచారణ, రైతు సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభించజేస్తున్న ప్రతిపక్షాలు.. ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వానికి మద్ధతు ప్రకటించాయి. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని వెల్లడించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు చెప్పారు..

రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది.. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్య పరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం ఉంది.. అయితే.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహాత్మకంగా ఈబిల్లును తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తు్న్నాయి. 

Tags:    

Similar News