Rajya Sabha Deputy Chairman : రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం
విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్ ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారాని.. మెజారిటీ సభ్యులు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించినా మూజువాణి ఓటుతో..
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంష్ నారాయణ్ సింగ్‌పై మధ్యాహ్నం 3:40 గంటలకు ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం చేశాయి. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసిన పార్టీలలో కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, సిపిఐ (ఎం) ఎన్‌సిపి, టిఆర్‌ఎస్, ఎస్పీ, ఐయుఎంఎల్, టిఎంసి ఉన్నాయి. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్ ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారాని.. మెజారిటీ సభ్యులు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించినా మూజువాణి ఓటుతో ఆమోదించారని..ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకుందని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు.
అందుకు నిరసనగా డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మీడియాకు వెల్లడించారు. ఇదిలావుంటే విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలో వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదముద్రవేసారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంష్ నారాయణ్ సింగ్.. అయితే అంతకుముందు ఈ బిల్లులు రాజ్యసభలో తీవ్ర దుమారం సృష్టించాయి.