INDIA Alliance: ముంబైలో ఇండియా కూటమి పక్షాల మూడో సమావేశం
INDIA Alliance: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడిగా పోటీ చేయాలని తీర్మానం
INDIA Alliance: జుడేగా భారత్.. జీతేగా ఇండియా.. నినాదంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ముంబైలో ఇండియా కూటమి పక్షాల మూడో సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించడంతో పాటు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడిగా పోటీ చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు. సీట్ల పంపకాలను ఇచ్చి, పుచ్చుకునే పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇక.. 14 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది ఇండియా కూటమి.